telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

మతాంతర వివాహ దంపతుల సంతానానికి .. ధ్రువీకరణ పత్రాలు..

birth certificate issued to kid of 2 religion parents

మతాంతర వివాహాలకు ఉన్న అడ్డు తొలిగినట్టే.. కఠిన చట్టాలను మానవత్వం అధిగమించింది. నిబంధనలను పక్కనబెట్టి, ఓ హిందూ యువకుడు, ముస్లిం యువతికి పుట్టిన చిన్నారికి బర్త్ సర్టిఫికెట్ లభించేలా చేసింది. యూఏఈ దేశ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. వివరాల్లోకి వెళితే, యూఏఈ చట్టాల ప్రకారం, ముస్లిం మతస్తుడు ముస్లిమేతర మహిళను పెళ్లి చేసుకోవచ్చు కానీ, ముస్లిం మహిళ ముస్లిమేతరుడిని వివాహం చేసుకునేందుకు వీలుండదు.

ఇండియాకు చెందిన కిరణ్ బాబు, సన్ సాబూలు 2016లో కేరళలో వివాహం చేసుకుని, షార్జాలో నివాసం ఉంటున్నారు. వారికి గత సంవత్సరం జూలైలో కుమార్తె జన్మించగా, అనామ్తా ఏస్ లిన్ కిరణ్ అని పేరు పెట్టుకున్నారు. చట్టాల కారణంగా పాపకు జన్మ ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చేందుకు అధికారులు అంగీకరించలేదు. ఈ దంపతులు కోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు. ఇక వారు ఇండియాకు వెళ్లేందుకు చూడగా, పాపకు ఇమిగ్రేషన్ క్లియరెన్స్ లభించలేదు. దీని తో కిరణ్ మరోమారు కోర్టును ఆశ్రయించగా, మానవతా దృక్పథంతో బర్త్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు అనుమతిస్తున్నామని కోర్టు పేర్కొంది. దీని తో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Related posts