telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

లెమ‌న్ గ్రాస్ .. టీ విశిష్టత .. తెలుసుకోవాల్సిందే..!

lemon grass tea for health

భారతదేశంతో పాటు ప‌లు ఆసియా దేశాల్లోనూ లెమ‌న్ గ్రాస్ మొక్క బాగా పెరుగుతుంది. ఈ మొక్క ఆకుల్లో అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు దాగి ఉంటాయి. లెమ‌న్‌గ్రాస్ ఆకుల్లో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్‌, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఈ ఆకులు ఔష‌ధంగా ప‌నిచేస్తాయి. అయితే లెమన్‌గ్రాస్ ఆకుల నుంచి త‌యారుచేసే టీని నిత్యం తాగ‌డం వల్ల కూడా మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో తెలుసుకుందాం..!

* లెమ‌న్‌గ్రాస్ ఆకుల టీ తాగ‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం త‌గ్గుతాయి. త‌ల‌నొప్పి, ఒళ్లు నొప్పులు, కండ‌రాల నొప్పులు, క‌డుపు నొప్పి త‌గ్గుతాయి.lemon grass tea for health* ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. ఇన్‌ఫెక్ష‌న్లు త్వ‌ర‌గా త‌గ్గుతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి.

* కిడ్నీ స‌మ‌స్య‌లు పోతాయి. మూత్రాశ‌యం నుంచి మూత్రం సాఫీగా వ‌స్తుంది. శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.

* శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. డ‌యాబెటిస్ కంట్రోల్ అవుతుంది.

* అధిక బ‌రువు త‌గ్గుతారు. చ‌ర్మ స‌మ‌స్య‌లు పోతాయి.

Related posts