telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“పలాస 1978” టీజర్

palasa movie will be in may

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా “పలాస 1978”. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. కరుణకుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రియలిస్టిక్ అప్రోచ్‌తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్‌ని డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శుక్రవారం విడుదల చేశారు.

టీజర్ విడుదల అనంతరం పూరీ జగన్ మాట్లాడుతూ “ఇలాంటి గ్యాంగ్ స్టర్ కథలు అంటే నాకు చాలా ఇష్టం. అందరూ తిడుతున్నారని గ్యాంగ్ స్టర్ కథలు తీయడం లేదు. కానీ పలాస టీజర్ చూస్తుంటే నాకు చాలా చాలా నచ్చింది. హీరో, హీరోయిన్ బాగున్నారు. ఇందులో కనిపించిన ప్రతి క్యారెక్టర్ చాలా కన్విన్స్‌గా ఉంది. దర్శకుడు కరుణకుమార్ వర్క్ చాలా బాగుంది. పలాస పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు కరుణకుమార్ మాట్లాడుతూ “ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. చిత్ర కథాంశం గురించి తెలిసిన చాలామంది ఈ సినిమా కోసం ఆరా తీస్తున్నారు. ఇటీవలే విడుదలైన ‘ఓ సొగసరి’ అనే పాటకు మంచి స్పందన లభించింది. మా టీజర్‌ను పూరీగారు లాంచ్ చేయడం మా అదృష్టం. ఆయనకు టీమ్ తరపున ధన్యవాదాలు. అందరికీ మా టీజర్ నచ్చుతుందని ఆశిస్తున్నా. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం” అన్నారు. రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Related posts