అల్లు అర్జున్ సరసన ‘డీజే’, ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’, మహేష్ బాబుతో కలసి ‘మహర్షి’లో, తాజాగా బన్ని సరసన అలవైకంఠపురములో నటించి వరుస హిట్లతో ఫుల్ స్పీడ్ తో దూసుకెళ్తోంది పూజాహెగ్డే. ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ. ఇలా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న హీరోయిన్ పూజా హెగ్డే బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతోంది. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి అగ్ర హీరోల సరసన నటించే ఛాన్సులు కొట్టేసింది. తాజాగా పూజకు మరో మంచి అవకాశం వచ్చిందట. స్వప్న సినిమా బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా తెలుగుతోపాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ విడుదల కాబోతోందట. ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర పూజను వరించిందట. ఈ సినిమాకు పూజ వెంటనే ఓకే చెప్పేసిందట. ఈ సినిమా విజయవంతమైతే తమిళ, మలయాళ భాషల నుంచి కూడా తనకు అవకాశాలు వస్తాయని భావిస్తోందట.
previous post
నేను ట్రెండ్ ఫాలో అవ్వను బ్రదర్, ట్రెండ్ సెట్ చేస్తా… నితిన్ కామెంట్స్ పై సాయి ధరమ్ తేజ్