telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బార్ల యజమానులకు ఊరట!

liquor shops ap

దేశ వ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ సడలింపులివ్వడంతో వివిధ రంగాల వ్యాపార సంస్థలు తెరుచుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితమే వైన్ షాపులు పునఃప్రారంభమయ్యాయి. అయితే సోషల్ డిస్టెన్స్ నేపథ్యంలో బార్లకు మాత్రం ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. దీంతో బార్లలో ఉన్న మద్యం బాటిళ్లు అలాగే మిగిలిపోయాయి. దీనివల్ల బార్ల యజమానులు నష్టపోతున్నారు. అంతేకాదు, కాలపరిమతి దాటితే బీర్లు పాడైపోయే అవకాశముంది.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. బార్లలో స్టాక్ ఉన్న మద్యం బాటిళ్లను రీటెయిల్ ఔట్ లెట్లలో విక్రయించుకునే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించింది. అయితే సీల్డ్ బాటిళ్లను మాత్రమే అమ్మాలని షరతు విధించింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బార్ల యజమానులకు ఊరట లభించింది.

Related posts