telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చెడును మాత్రమే హైలైట్ చేస్తున్నారు… అన్నింటికీ చిత్ర పరిశ్రమనే బలి… : అదితిరావు హైదరి

Aditi

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసుపై సీబీఐ లోతుగా విచారణ జరుపుతున్న క్రమంలో రోజుకో కొత్త ట్విస్ట్ బయటకొస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ లో నెపోటిజం, డ్రగ్స్ దందా కలకలం సృష్టిస్తున్నాయి. డ్రగ్స్ కేసులో నటి సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి అరెస్ట్ అవ్వడం, ఆమె 25 మంది పేర్లు బయట పెట్టడం, మరోవైపు శాండిల్ వుడ్ లో డ్రగ్స్ వ్యవహారంలో కొంతమంది హీరోయిన్ అరెస్ట్ కావడం… ఇలా ఎన్ని జరగాలో అన్నీ జరుగుతున్నాయి. అయితే ప్రతి దానికి సినిమావాళ్లనే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అంటోంది హీరోయిన్ అదితిరావు హైదరి. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “కరోనా సమయంలో ప్రజలకోసం చాలా మంది తారలు చాలా మంచి పనులు చేస్తున్నారు. మంచిని దాచి చెడును మాత్రమే హైలైట్ చేస్తున్నారు. అందరూ ప్రతికూలంగా కాకుండా సానుకూలతపై ఎక్కువ దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. మేం ఏం మాట్లాడినా… అందులో ఒక తప్పు పదం దొరికినా వెంటనే టార్గెట్ అయిపోతాం. ప్రతి ఒక్కరూ తప్పు మాట్లాడిన వారిపై విమర్శలకు దిగుతారు. అలాగని మాట్లాడకపోయినా ప్రతి ఒక్కరూ తప్పుపడతారు. అన్నింటికీ చిత్ర పరిశ్రమనే బలి చేస్తారా? ఇది సరైంది కాదు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది అదితి.

Related posts