telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అక్షయ్ కుమార్ “లక్ష్మీ బాంబ్” ట్రైలర్

Laxmi Bomb

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన “కాంచన”కు హిందీ రీమేక్ గా “లక్ష్మీ బాంబ్” ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచేశారు. 3 నిమిషాల 40 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్‌లో అక్షయ్ కమార్ పర్‌ఫార్‌మెన్స్ హైలైట్ అవుతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే అక్షయ్ నటన ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ తెచ్చిపెట్టడం ఖాయం అనిపిస్తోంది. హిందీలో లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న మొదటి సినిమా ఇదే. కాంచన సిరీస్ నచ్చి ఈ సినిమా రీమేక్ బాధ్యతలు స్వయంగా అక్షయ్ కుమార్ తీసుకోవడం విశేషం. ట్రైలర్‌లో చూపించిన సన్నివేశాలను బట్టి అచ్చం కాంచన సినిమానే దించేశారని అర్థమవుతోంది. ఈ చిత్రానికి అమర్ మోహిలే ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. తనీష్ బాగ్చీ, శశీ-ఖుషీ, అనూప్ కుమార్ సంగీతం సమకూర్చారు. హారర్ కామెడీ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని నవంబర్ 9వ తేదీన హాట్ స్టార్‌లో రిలీజ్ చేయనున్నారు. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts