సీఎం చంద్రబాబు రాజధాని నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. ఎమ్యెల్యే క్వార్టర్స్ నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. కొత్త శాసనసభ కొలువుదీరాక నూతన సభ్యులు రాజధానిలో ఉండేందుకు భవనాలు సిద్ధం చేయాలని చంద్రబాబు సూచించారు. వర్షాకాలం నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు.
రాజధాని నుంచి ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ రోడ్లను న్యాయ వివాదాలు లేకుండా వేగంగా పూర్తి చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. రహదారులు సిద్ధమైతే అమరావతికి రాకపోకలు పెరుగుతాయని బాబు అన్నారు.