దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్ మొదటి చిత్రం “ధడక్”తోనే విజయాన్ని అందుకొని తన సత్తా చాటింది. ఆ తరువాత హీరోయిన్ గా ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈమె “తక్త్”, “కార్గిల్ గర్ల్”, “రూహ్ అఫ్జా” చిత్రాలతో బిజీగా ఉన్నారు. “కార్గిల్ గర్ల్” సినిమా విషయానికొస్తే… ఐఏఎఫ్ విమానం నడిపిన తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. గత ఏడాది చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా , ఈ చిత్రాన్ని మార్చి 13, 2020న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. శరన్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ తండ్రిగా పంకజ్ నటిస్తున్నారు. నటుడు అంగద్ బేడీ జాన్వీకి సోదరుడిగా కనిపించనున్నారు. తాజాగా గుంజన్ సక్సెనా పాత్రలో నటిస్తున్న జాన్వీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో జాన్వీ లుక్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. గుంజన్ సక్సేనా.. “కార్గిల్ గర్ల్” అనే టైటితో చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రం కోసం జాన్వీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో శిక్షణ తీసుకుంది. అయితే మహిళా పైలట్ గుంజన్ 1999 కార్గిల్ యుద్ధంలో గాయాలపాలైన సైనికులను తన విమానంలో ఎక్కించుకుని సురక్షిత ప్రాంతానికి తరలించి అందరిచే ప్రశంసలు పొందింది. ఆమె ధైర్యానికి మెచ్చిన ప్రభుత్వం శౌర్యవీర్ అవార్డ్ కూడా అందించింది. ఈమె జీవిత నేపథ్యంలో సినిమా రావడం అనేది హర్షణీయం.
previous post