telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అక్షయ్ సినిమాలో మరో స్టార్‌.. ఇదే మొదటిసారి

Akshay-Kumar

అక్షయ్ కుమార్ తన విలక్షణమైన నటనతో అందరికి గుర్తిండిపోయాడు. ఎటువంటి పాత్ర అయినా ఎంతో సులభంగా చేసి అభిమానులను అలరిస్తాడు. ఇప్పటికే అన్ని రకాల పాత్రలలో చేసి బాలీవుడ్ ప్రేక్షకులచేత కిలాడీగా ముద్ర వేయించుకున్నాడు. యాక్షన్, కామెడీ, దేశభక్తి, సామాజికత అన్ని విధాల పాత్రలలోనూ అక్షయ్ కనిపించాడు. అతడు ఇటీవల విడుదల చేసిన లక్ష్మీ సినిమాలోనూ హిజ్రా పాత్రలో కనిపించి అందరిని అలరించాడు. ప్రస్తుతం అక్షయ్ ప్రధాన పాత్రగా సాజిద్ దర్శకత్వంలో బచ్చన్ పాండే సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో అక్షయ్ సరసన క్రితీ సనన్ నటిస్తోంది. ఇందులో అక్షయ్ నటుడిగా ఉండాలనే కొరిక ఉన్న గ్యాంగ్ స్టర్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్ర యూనిట్‌లోకి ఇప్పడు మరో హీరో చేరనున్నాడు. ఈ జట్టులో చేరేందుకు వస్తోంది అర్షద్ దర్సీ ఓకే చెప్పాడు. అక్షయ్, అర్షద్ ఒకే తెరపై కనిపించడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు ఎన్నడూ వీరు కలిసి నటించింది లేదు. ఇందులో అక్షయ్ గ్యాంగ్‌లో సభ్యుడిగా అర్షద్ కనిపిస్తాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరీలో మొదలు అయ్యి మార్చిలో మొగవనుంది.

Related posts