telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఉత్కంఠను రేకెత్తిస్తున్న “అంధకారం” టీజర్

Andhakaram

హీరోయిన్ పూజా రామ‌చంద్ర‌న్ ప్రధాన పాత్ర‌లో న‌టిస్తోన్న తాజా చిత్రం “అంధ‌కారం”. వి విజ్ఞ‌రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్యాష‌న్ స్టూడియోస్, ఓ 2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్లు పై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అట్లీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రియ అట్లీ, కే పూర్ణ చంద్ర‌, సుదాన్ సుంద‌ర‌మ్ నిర్మాత‌లుగా తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో పూజా రామచంద్ర‌న్ తోపాటు కుమార్ న‌ట‌రాజ‌న్, మీనా గోషాల్, అర్జున్ దాస్, వినోత్ కిష‌న్ కీలక పాత్రల్లో న‌టించారు. తాజాగా “అంధ‌కారం” చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రబృందం. ట్రైలర్ లోని డైలాగులు, సన్నివేశాలు ఆడియెన్స్ కి సినిమా మీద మ‌రింత ఉత్కంఠ ను రేకెత్తిస్తున్నాయి. సరికొత్త కంటెంట్ తో రూపొందుతున్న ఈ థ్రిల్లర్ మూవీ త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts