telugu navyamedia
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ సక్సెస్ వేడుక‌ల్లో ఐటెం బాంబ్ ర‌చ్చ ..

దర్శక ధీరుడు రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ . ప్ర‌పంచ‌వ్యాప్తంగా గత నెల 25 న విడుద‌లై బాక్సాఫీస్​ వద్ద దూసుకుపోతోంది.

రెండు వారాల్లో వరల్డ్ వైడ్ గా వెయ్యి కోట్లు రాబట్టి తెలుగు సినిమా సత్తాను చూపించింది. ఇక నార్త్ లోను ఈ మూవీ 200 కోట్లు రాబట్టి పలు రికార్డ్స్ నమోదు చేసింది.

Thumbnail image

దీంతో ముంబయిలో సక్సెస్ పార్టీ ఇచ్చారు డిస్ట్రిబ్యూట్ జయంతిలాల్. ఈ పార్టీకి రామ్​చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, దానయ్యతోపాటు బాలీవుడ్​ కరణ్ జోహార్, జావేద్ అక్తర్, అమీర్ ఖాన్​ సక్సెస్ సెలెబ్రేషన్స్​లో పాల్గొన్నారు.

ఈ పార్టీలో బాలీవుడ్​ హాట్ బాంబ్ రాఖీ సావంత్ ఎర్రటి అవుట్ ఫిట్​తో రచ్చ రచ్చ చేసింది. ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. అంతేకాదు.. ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులు వేసి.. స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచింది.

RRR 1000 crore success bash: Rakhi Sawant reveals who'll win among Jr. NTR  and Ram Charan in Bigg Boss [EXCLUSIVE VIDEO]

ఈ సందర్భంగా తన ఫేవరెట్ హీరో రామ్ చరణ్ ను కలిశానని చెప్పింది. తారక్ తోనూ ముచ్చటించిన ఈ సుందరి.. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్​ చేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.

RRR: Rakhi Sawant poses with Aamir Khan, Johnny Lever at film's success  party

Related posts