ప్రస్తుతం సోషల్ మీడియాలో “బాటిల్ క్యాప్ ఛాలెంజ్” వైరల్ అవుతోంది. కికీ ఛాలెంజ్, ఐస్ బకెట్ ఛాలెంజ్ అంటూ రకరకాల ఛాలెంజ్‌లు యూత్‌ని ఉర్రూతలూగించాయి. ఇప్పుడు ఈ కొత్త ఛాలెంజ్ యూత్ ను అట్ట్రాక్ట్ చేస్తోంది. ఈ ఛాలెంజ్ లక్ష్యం ఏంటంటే ఓ టేబుల్‌పై బాటిల్‌ను పెట్టి, దానికి కొద్ది దూరంలో నిలబడి మూతను బాటిల్ కింద పడకుండా తన్నాలి. తాజాగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఈ ఛాలెంజ్ లో సక్సెస్ అయ్యానంటూ వీడియో పోస్ట్ చేశారు. దీంతో ప్రముఖులతో పాటు యూత్ కూడా ఈ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోన్న ఈ ఛాలెంజ్ ను ఇటీవలే డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ క్రికెట్ బ్యాట్ తో ఓ షాట్ కొట్టి పూర్తి చేశాడు. తాజాగా తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు విభిన్నంగా బాటిల్ క్యాప్ చాలెంజ్‌ను పూర్తి చేసి ట్వీట్ చేసారు.
My team asked me .. why I have to do the same thing being this late 🙄 I told them, it’s me from #VTheFilm doing this 😬 Well, this is my formal #BottleCapChallenge 🤸😛
PS : I also have something different in the store 😜 pic.twitter.com/900pl4YomZ— Sudheer Babu (@isudheerbabu) July 9, 2019
ముందుగా అక్షయ్ లాగే కాలితో బాటిల్ క్యాప్స్ ఓపెన్ చేసిన సుధీర్ బాబు, తరువాత బ్యాడ్మింటన్ ఆడుతూ బాటిల్ క్యాప్‌ను ఓపెన్ చేశాడు. సీనియర్ నటుడు అర్జున్ సైతం ఈ బాటిల్ క్యాప్ ఛాలెంజ్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
And this is me from #PullelaGopichand having fun in a different way 😜 My Badminton #BottleCapChallenge 🏸🏸. pic.twitter.com/v6ayF8oV4y
— Sudheer Babu (@isudheerbabu) July 10, 2019