టీడీపీ మొత్తం బీజేపీతో కలిసిపోతుందని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల టీడీపీ పాలనలో బీజేపీతోనే ప్రేమాయణం సాగించామని, అయితే ఇప్పుడు తాళి కట్టించుకుని సంసారం చేస్తామన్నారు.రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని చెప్పుకొచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, మాజీ సీఎం చంద్రబాబు సలహాలు ఎంతో అవసరమన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాడిపత్రిలో పర్యటించిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవలే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఢిల్లీకి వెళ్లి బీజేపీ చేరిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో జేసీ సోదరులు పార్టీ మారుతున్నట్లు అనంతపురం జిల్లాలో వార్తలు వినిపిస్తున్నాయి.
బీజేపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు: కన్నా