telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నెటిజన్ కు రానా క్లాస్… ఇంతకీ ఏం జరిగిందంటే ?

Aranya

రానా దగ్గుబాటి హీరోగా తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ‘హథీ మేరే సాథీ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో నిర్మిస్తోంది. తాజాగా తమిళ్, తెలుగు టైటిల్స్ ప్రకటిస్తూ రానా లుక్ రిలీజ్ చేశారు. తమిళ్‌లో ‘కాదన్’, తెలుగులో ‘అరణ్య’ పేరుతో ఈ సినిమా తెరెక్కెతోంది. పోస్టర్‌లో రానా డిఫరెంట్‌ వేషధారణ, హావభావాలతో అగ్రెసివ్‌గా కనిపిస్తున్నాడు. జోయా హుస్సేన్‌, శ్రియా పిల్గావుంకర్‌, పుల్‌కిత్‌ సామ్రాట్‌, విష్ణు విశాల్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా అధిక భాగాన్ని కేరళ అడవుల్లో చిత్రీకరించారు. ఆస్కార్‌ విజేత రసూల్‌ సౌండ్‌ ఇంజినీర్‌గా పనిచేశాడు. ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఏప్రిల్ 2న ఈ సినిమా మూడు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి రానా లుక్ విడుదలైన సందర్భంగా ఫ్యాన్స్ అంతా కంగ్రాట్స్ చెప్తుంటే ఓ నెటిజన్ మాత్రం రానాను గెలికాడు. అప్పుడెప్పుడో రానా ఇచ్చిన ఇంటర్వ్యూని పోస్ట్ చేస్తూ కామెంట్ చేసాడు. ఆ ఇంటర్వ్యూలో రానా ఓ మాటన్నారు. ‘నేను పదో తరగతి ఫెయిల్ అయ్యాను. కానీ ఆ ఫలితాలు నా కలలు నెరవేర్చుకోకుండా ఆపలేకపోయాయి’ అన్నారు. దీనికి సదరు నెటిజన్ కౌంటర్ వేసాడు. ‘ఎందుకంటే నా కుటుంబానికి పెద్ద ప్రొడక్షన్ కంపెనీ ఉంది’ అన్నాడు. దీనిపై రానా స్పందిస్తూ “అందులో ఏమీ లేదు బ్రో. మనం నటన అనే ఆర్ట్‌ని నేర్చుకోకపోతే వెనక ఎంత పెద్ద నిర్మాణ సంస్థ ఉన్నా వేస్టే. ఇండియాలో చాలా స్టూడియోస్ ఉన్నాయి. కానీ ఏం లాభం. టాలెంట్ లేక కూరుకుపోతున్నాయి. నిన్ను ప్రపంచమంతా ఫెయిల్యూర్ అని ఎగతాళి చేసినా కూడా నీ కలలు సాకారం చేసుకోగలగాలి” అంటూ ఆ నెటిజన్ కు క్లాస్ తీసుకున్నారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చిత్ర పరిశ్రమలో ఎప్పటినుంచో నెపోటిజం (బంధుప్రీతి) విషయంపై చర్చలు జరుగుతున్నాయి. అటు బాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ ఆ ఇష్యూ ఉంది. కానీ బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఈ అంశంపై స్పందించినంతగా టాలీవుడ్ వాళ్లు రియాక్ట్ అవ్వరు. ఎందుకంటే టాలీవుడ్ మొత్తాన్ని నడిపిస్తోంది స్టార్ కిడ్సే. దాదాపుగా హీరోలంతా ఒకప్పటి సినిమా స్టార్ల బిడ్డలే. ఇంకెవరు మాట్లాడతారు బంధుప్రీతి గురించి…!?

Related posts