telugu navyamedia
సినిమా వార్తలు

68వ జాతీయ చలన చిత్ర అవార్డులు : ఉత్తమ న‌టులుగా సూర్య, అజయ్ దేవగన్

68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పురస్కారాల్లో దక్షిణాది చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ సత్తా చాటారు.

తాజాగా కేంద్రం ప్రకటించిన 68వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సూర్య హీరోగా నటించిన ‘సూరయై పొట్రు’ తెలుగులో ఆకాశం నీ హద్దురా’ సినిమాకు అవార్డుల పంట పండింది. ఈ సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా ‘సూరయైపొట్రు’ ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది.

మరోవైపు ఈ సినిమాలో హీరోగా నటించిన సూర్య జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కైవసం చేసుకున్నారు. మరోవైపు తానాజీలోని నటనకు గాను అజయ్ దేవ్‌గణ్ జాతీయ అవార్డు అందుకున్నారు.

ఇక ఆకాశమే నీ హద్దురా సినిమాలో హీరోయిన్‌గా నటించిన అపర్ణ బాలమురళి ఉత్తమ నటిగా ఎంపికైయింది. ఇక అల వైకుంఠపురములో’ మ్యూజిక్‌గాను తమన్ జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. తెలుగులో కలర్ ఫోటో జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. మరోవైపు ‘నాట్యం’ సినిమాలకు బెస్ట్ మేకప్, బెస్ట్ కొరియోగ్రఫీ విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది.

అవార్డు గ్రహీతలు వీళ్లే..

ఉత్తమ కటుంబ విలువల కథాచిత్రం ‘కుంకుం అర్చన్’
జాతీయ ఉత్త‌మ ఉత్తమ నటిగా అపర్ణ బాలమురళి
జాతీయ ఉత్తమ నటులుగా హీరో సూర్య, అజయ్ దేవగన్
జాతీయ ఉత్త‌మ సినిమా ( క‌ల‌ర్ ఫోటో)
ఉత్తమ సంగీత దర్శకుడిగా (తమన్‌)
జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా సంధ్యా రాజు (నాట్యం సినిమా )
జాతీయ ఉత్తమ మేకప్ మెన్ గా రాంబాబు (నాట్యం సినిమా)
జాతీయ ఉత్తమ మూవీ – సూరారై పోట్రు (సుధా కొంగర)
జాతీయ ఉత్తమ డైరెక్టర్ – సచ్చిదానంన్(అయ్యప్పనుమ్ కొషియమ్)
జాతీయ ఉత్తమసపోర్టింగ్ యాక్ట్రెస్ – లక్ష్మీ ప్రియ చంద్రమౌళి (శివ రంజనీయం ఇన్నుమ్‌ సిలా పెంగళం)
జాతీయ ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ – బిజూ మేనన్‌ (అయ్యప్పనుమ్‌ కోషియుం)
జాతీయ ఉత్తమ ప్రేక్షకాదరణ పొందిన సినిమా – తానాజీ

Related posts