telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ సినిమా వార్తలు

ఉపాసన కొణిదెలకు మహాత్మా గాంధీ అవార్డు

upasana got dadasaheb palke award

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. హెల్త్ టిప్స్ తో పాటు చరణ్ కు సంబంధించిన అప్డేట్స్, ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఉపాసన కొణిదెల… రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగానే కాకుండా, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా.. పెళ్లి తర్వాత ఏకంగా 14 కిలోలు తగ్గిన ఉపాసన, మంచి ఫిట్‌నెస్ మెయిన్‌టైన్ చేస్తూ, ఆరోగ్య సూత్రాలను చెబుతూ.. తన సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. వీలున్నప్పుడల్లా.. పేదలకు, అనాథ బాలలకు సాయం చేస్తూ మంచి మనసున్న మనిషిగానూ గుర్తింపు పొందారు ఉపాసన. తన సేవలకు గుర్తింపుగా… ఆ మధ్య ఉపాసన కొణిదెలకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఉపాసన మరో ప్రతిష్టాత్మక అవార్డ్ గెలుచుకుంది. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటి నాయకత్వ విభాగంలో తన సేవలకు గుర్తింపుగా మహాత్మా గాంధీ అవార్డు సొంతం చేసుకున్నారు ఉపాసన. ఇదే విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఆమె తన పోస్ట్‌లో రాస్తూ… “ఇతరులకు సేవ చేయడం ద్వారా నిన్ను నువ్వు కోల్పోయే క్రమమే.. నిజమైన నిన్ను కనుగొనే గొప్ప మార్గం అన్నారు. మహాత్మా గాంధీ అవార్డు వచ్చినందుకు ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.

Related posts