telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్‌బాస్‌ బ్యూటీ హిమజ విడాకులు.. ఏం చెప్పిందంటే..

బిగ్‌బాస్‌ బ్యూటీ హిమజ విడాకుల వార్తలపై స్పందించారు. ఆమె పేరు గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తను అన్‌ఫాలో చేసిందని, హిమజ త్వరలో తన భర్తకు విడాకులు ఇవ్వబోతుందన్న వార్తలు బాగా హల్ చల్ చేస్తున్నాయి.

అసలు హిమజకు పెళ్లయిందనే విషయంపైనే ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. అలాంటిది పెళ్లి, భర్తకు విడాకులేంటన్నది తెలియక నెటిజన్లు అయోమయంలో పడిపోయారు.

తాజాగా తన విడాకులపై సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాలపై హిమజ స్పందించింది. ఈ మధ్య యూట్యూబ్‌లోనే పెళ్లిళ్లు, విడాకులు చేసేస్తున్నారు. సాధారణంగా ఇలాంటివి నేను పట్టించుకోను. కానీ మా పేరెంట్స్‌ కాస్త సున్నితంగా ఉంటారు. ఇలాంటి వల్ల వాళ్లు ఎక్కువ బాధపడతారు. దయచేసి ఇలాంటి ఫేక్‌ న్యూస్‌లు ప్రచారం చేయకండి.

Bigg Boss Fame Himaja Reddy Photoshoot - TeluguBulletin.com

అలాగే నా పెళ్లి, విడాకులకు నన్ను కూడా పిలవండి’ అంటూ వ్యంగంగా స్పందించింది. 3-4 ఏళ్లలో తప్పకుండా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందని, ఒకవేళ చేసుకుంటే చాలా గ్రాండ్‌గా , అంద‌మైన పువ్వులు డిజైన్ చేయించుకుని అందరికి చెప్పి చేసుకుంటానని తెలిపింది.

Bigg Boss Fame Himaja Latest Photos - Biggboss Pics Latest-Telugu Actress  Hot-TeluguStop

అంతే కాక మంచి వాడిని కూడా మీరే చూడండని ఆమె కోరింది. గత కొన్ని రోజులుగా నా వీడియోలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. దీంతో కొందరు కుట్ర పన్ని ఇలాంటి ఫేక్‌ న్యూస్‌లు క్రియేట్‌ చేస్తున్నారు’ అని ఆమె పేర్కొంది. ఈ విషయంలో నాకు అండగా  నిలిచిన అందరికీ ధన్యవాదాలు… అంటూ తెలియజేశారు. 

Related posts