telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేష్ బాబు న్యూ లుక్… అదుర్స్ అంటున్న అభిమానులు

mahesh

చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన మహేష్ తన కొత్త లుక్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. తాజాగా ఓ యాడ్ షూట్ కోసం మహేష్ కెమెరా ముందుకు వచ్చాడు. ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ ఆధ్వర్యంలో యాడ్ షూట్ జరిగింది. మళ్లీ షూటింగ్‌కు రావడం సంతోషంగా ఉందని మహేష్ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. తాజాగా ఈ యాడ్ కోసం మహేష్ ఫోటో షూట్ చేసాడు. లైట్ గడ్డం తో డిఫరెంట్ హెయిర్ స్టైల్ ఒక సింపుల్ లుకింగ్ టీషర్ట్ లో మహేష్ బాబు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదే లుక్ తో సర్కారు వారి పాట చిత్రంలో కూడా మహేష్ బాబు కనిపించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. మహేష్ బాబు త్వరలో ‘సర్కారు వారి పాట’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. సందేశాత్మక అంశాలతో కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ‘సర్కారు వారి పాట’ పై అటు మహేష్ ఫ్యాన్స్ లోనూ ఇటు సినీ అభిమానుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇక సర్కార్ వారి పాట లో మహేష్ సరసన మహానటి కీర్తిసురేష్ నటిస్తుందని తెలుస్తుంది.

Related posts