telugu navyamedia
సినిమా వార్తలు

“ఎన్‌.జి.కె” మూవీ మా వ్యూ

surya ngk movie teaser

బ్యానర్ : డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయెన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
ఏపీ, టీఎస్ డిస్ట్రిబ్యూష‌న్ : శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌
న‌టీన‌టులు : సూర్య, సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌
దర్శకత్వం : శ్రీరాఘవ.
సంగీతం : యువన్‌ శంకర్‌రాజా,
సినిమాటోగ్రఫీ : శివకుమార్‌ విజయన్‌,
నిర్మాతలు : ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు,

ప్రముఖ తమిళ నటుడు సూర్య యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ మార్కును క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుడు శ్రీ రాఘ‌వ‌. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే భారీ అంచనాలు పెరిగిపోయాయి. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం “ఎన్‌.జి.కె”. ర‌కుల్ ఫ్రీత్‌సింగ్‌, సాయి ప‌ల్ల‌వి ఇద్ద‌రూ సూర్య స‌ర‌స‌న తొలిసారి న‌టించారు. ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్‌ పవర్ ఫుల్ గా ఉండడంతో సినిమా గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాము.

క‌థ‌ :
నంద‌గోపాల కృష్ణ అలియాస్ ఎన్‌.జి.కె (సూర్య‌). అత‌ని త‌ల్లిదండ్రులు (ఉమా ప‌ద్మ‌నాభ‌న్ నిర‌ల్‌గ‌ల్ ర‌వి), భార్య గీతాకుమారి (కుమారి). ఊర్లో సామాజిక సేవ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండే నంద గోపాల్ అంటే న‌చ్చ‌ని వాళ్లు అత‌నిపై, అత‌ని మ‌నుషుల‌పై దాడి చేస్తారు. దాంతో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని ఎమ్మెల్యే (ఇళ‌వ‌ర‌సు) ద‌గ్గ‌రకు వెళ్తాడు. విధిలేక గోపాల్ ఎమ్మెల్యే ద‌గ్గ‌ర చేరతాడు. ఎమ్మెల్యే గోపాల్‌ను మాన‌సికంగా బాధ‌ పెడుతుంటాడు. దాంతో రాజ‌కీయాల్లోకి తాను రావాల‌నుకుని గోపాల్ ఎమ్మెల్యే చెప్పిన ప‌నుల‌న్నీ చేస్తుంటాడు. ఎన్‌.జి.కె గురించి తెలుసుకున్న పార్టీ అధిష్టానం పి.ఆర్ వ‌నిత‌ (ర‌కుల్ ప్రీత్ సింగ్‌) ఎన్‌.జి.కెని ఓ స‌హాయం అడుగుతుంది. అసలు రకుల్ సూర్యను ఎలాంటి సహాయం అడుగుతుంది ? దాని వ‌ల్ల ఎన్‌.జి.కెకు ఎదురయ్యే స‌మ‌స్య‌లేంటి ? చివ‌ర‌కు నంద‌గోపాల కృష్ణ ఏం చేశాడన్నది తెలియాలంటే వెండి తెరపై సినిమాను వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
సూర్య న‌ట‌న బావుంది. ఇక సూర్య భార్య‌గా న‌టించిన సాయిప‌ల్ల‌వి బాగానే ఆకట్టుకుంది. కాకపోతే కొన్ని సన్నివేశాలు కాస్త అతి అన్పిస్తాయి. ఇక ర‌కుల్ పాత్ర‌కు ఇంట్ర‌డ‌క్ష‌న్‌లో ఇచ్చిన బిల్డ‌ప్‌కు, క‌థా గ‌మ‌నంలో ఆమె పాత్ర సాగే తీరుకు సంబంధ‌మే ఉండ‌దు. ఇక మెయిన్ విల‌న్‌గా న‌టించిన దేవ‌రాజ్‌, ఇత‌ర పాత్ర‌ధారులు పాత్ర ప‌రిధి మేర న‌టించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
శ్రీరాఘ‌వ ఎక్కడా హీరోయిజం ఎలివేష‌న్‌ లేకుండా సినిమాను, క‌థ ప్ర‌కారం పాత్ర‌ను డిజైన్ చేశారు. ద‌ర్శ‌కుడు శ్రీరాఘ‌వ చాలా గ్యాప్ త‌ర్వాత చేసిన సినిమా కావ‌డంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. కానీ సినిమాలో ఏం చెప్పాల‌నుక‌న్నాడ‌నేది ఓ క్లారిటీతో లేదు. యువ‌న శంక‌ర్ రాజా పాటలలో రెండు పాటలు బాగానే ఉన్నాయి. తెలుగు సాహిత్యం అర్థం కాలేదు. రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

రేటింగ్‌: 2.5/5

Related posts