telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సైరా”పై మహేష్ స్పందన

syeraa

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో అత్యంత్య ప్రతిష్టాత్మకంగా 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “సైరా”… చరిత్ర గుర్తించని వీరుడి కథ అంటూ అక్టోబర్ 2 మహాత్మగాంధీ జయంతి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా డైరక్షన్, మెగాస్టార్ చిరంజీవి నటన, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్ని సినిమాను కాపాడాయని చెప్పొచ్చు. అయితే అసలు కథకు మసాలా కోటింగ్ ఎక్కువైందన్న టాక్ నడుస్తోంది. “సైరా” మూవీపై మహేష్ బాబు స్పందించారు. అయితే సినిమా మొదలైన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకు వెళుతోంది. ఇక చిరంజీవి నటన పై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు చిరంజీవి నటన అద్భుతం అమోఘం అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక ఇప్పుడు తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం పై స్పందించారు. దృశ్యపరంగా సైరా సినిమా రిచ్ గా అద్భుతంగా ఉందని, మెగాస్టార్ చిరంజీవి నట విశ్వరూపం చూపించారని, సైరా తప్పక చూడాల్సిన సినిమా అని తెలిపారు. నిర్మాతగా వ్యవహరించిన రాంచరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డితో పాటు చిత్ర బృందానికి శుభాభినందనలు అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు మహేష్. మహేష్ ట్వీట్ చూసి మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Related posts