telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలకృష్ణతో మరోసారి జోడి కట్టనున్న హీరోయిన్

anjali

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’ ‘లెజెండ్’ పెద్ద హిట్ అందున్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత వస్తోన్న ఈ సినిమాకి అంచనాలు భారీగావున్నాయి. ‘లెజెండ్’ ను మించిన హిట్ అవ్వాలనీ బాలయ్య ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో యువ హీరో నవీన్ చంద్ర ఎమ్మెల్యేగా నటించనున్నాడు అని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమాలో చాలా మంది హీరోయిన్ పేర్లు వినిపించాయి. తాజాగా మరో హీరోయిన్ పేరు వినిపిస్తుంది. మొదట్లో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ అయితే బాగుంటుంది అని అనుకున్న బోయపాటి ఆతర్వాత తన నిర్ణయం మార్చుకున్నాడట. బాలయ్య సరసన నటించే అవకాశం నటి అంజలికి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. అంజలి గతంలో బాలకృష్ణ ‘డిక్టేటర్’ సినిమాలో నటించింది.

Related posts