telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ నటుడు ఫరాజ్ ఖాన్ ఇకలేరు

Raraz-KHan

బాలీవుడ్ ప్రముఖ నటుడు ఫరాజ్ ఖాన్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని నటి పూజా హట్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సాయం చేసిన అందరికీ థ్యాంక్స్‌. ఆయన లోటు ఎవ్వరూ పూడ్చలేనిది అంటూ పూజా భట్ ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తోంది. గత నెలలో ఛాతీ, మెదడు సంబంధిత ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆసుపత్రి ఖర్చులకు కూడా డబ్బులు లేకపోవడంతో ఆయనకు సాయం చేయాల్సిందిగా పూజా భట్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో స్పందించిన సల్మాన్ ఖాన్ ఆయనకు సహాయం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.1990లో నటుడిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఫరాజ్‌.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. మైనే ప్యార్ కియా, ఫరేబ్‌, మెహందీ వంటి చిత్రాల్లో నటించారు.

Related posts