telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఆసీస్ జట్టులోకి వార్నర్ ఎంట్రీ…

brad took again warner wicket

భారత్-ఆసీస్ ఇప్పటికే జరిగిన రెండు టెస్టులలో భారత్, ఆసీస్ ఒక్కో మ్యాచ్ లో విజయం సాధించాయి. అయితే ఈ పర్యటనలో జరిగిన మొదటి వన్డే సిరీస్ లో ఆసీస్ స్టార్ ఓపెనర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం బారిన విషయం తెలిసిందే. ఈ కారణంగా తర్వాత జరిగిన టీ20 సిరీస్ అలాగే ఇప్పటివరకు జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లలోను వార్నర్ ఆడలేదు. కానీ భారత్‌తో జరగనున్న మూడో, నాల్గవ టెస్టులకు ఓపెనర్ డేవిడ్ వార్నర్ తిరిగి వస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం ప్రకటించింది. ఇక వార్నర్ స్థానంలో టెస్టు జట్టులోకి వచ్చి నిరాశ పరిచిన జో బర్న్స్ తన స్థానాన్ని కోల్పోయాడు. ఇక ప్రాక్టీస్ మ్యాచ్ ‌ల్లో గాయంతో తప్పుకున్న ఫాస్ట్ బౌలర్ సీన్ అబోట్ కూడా తిరిగి టెస్ట్ జట్టులో చేరనున్నాడు. అయితే వార్నర్ రాకతో ఆసీస్ జట్టులో బలం, ఉత్సహం రెండు పెరిగాయి. చూడాలి మరి మూడో టెస్టులో విజయం ఎవరు సాధిస్తారు అనేది.

ఆస్ట్రేలియా జట్టు: టిమ్ పైన్ (c), సీన్ అబోట్, పాట్ కమ్మిన్స్, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మొయిసెస్ హెన్రిక్స్, మార్నస్ లాబుస్చాగ్నే, నాథన్ లియోన్, మైఖేల్ నేజర్, జేమ్స్ ప్యాటిన్సన్, విల్ పుకోవ్స్కీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్.

Related posts