telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సెప్టెంబర్ సుడిగాలి సుధీర్ కొత్త చిత్రం ప్రారంభం

Sudheer

జబర్దస్త్ షో తో కమెడియన్ గా పరిచయమైన సుధీర్ హీరోగా మరి ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే “సాఫ్ట్ వేర్ సుధీర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ తాజాగా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా ఇటీవల పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. సాంబశివ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అంజన్ బాబు నిమ్మల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ మొదటివారం నుంచి ప్రారంభం కాబోతోంది. సుధీర్ గతంలో హీరోగా చేసిన ‘సాఫ్ట్ వేర్’ సుధీర్ సినిమాకు కూడా రాజశేఖర్ రెడ్డి పులిచర్లనే దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. హీరో సుధీర్, నా కాంబినేషన్‌లో రాబోతోన్న రెండో సినిమా ఇది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. సప్తగిరి ఓ ప్రత్యేక పాత్రలో నటించనున్నారు. చక్కటి సంగీతం, యూత్‌ని ఆకట్టుకునే పాటలు, అదిరిపోయే కామెడీ పంచ్‌లు హైలెట్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుందని అని తెలిపారు.

Related posts