telugu navyamedia
సినిమా వార్తలు

పుష్ప కు కన్నడిగులు కన్నెర్ర..

ఐకాన్ స్టార్అల్లుఅర్జున్ హీరోగా​ నటించిన సినిమా “పుష్ప: ది రైజ్” . ఎర్ర చంద‌నం స్మంగ్లింగ్ నేప‌థ్యంలో క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్​ తెర‌కెక్కించిన ఈ సినిమా మ‌రికొద్ది గంట‌ల్లో (డిసెంబరు 17న) ఐదు భాషల్లో థియేట‌ర్‌లో విడుదల కానుంది. అయితే ఈ చిత్ర విడుదలపై కన్నడిగులు గుర్రుగా ఉన్నారు. ఈ చిత్రాన్ని కర్ణాటకలో బాయ్​కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. ఇందుకోసం ట్విట్టర్​లో #BoycottPushpaKarnataka హ్యాష్​ట్యాగ్​తో ట్రెండింగ్​ చేస్తున్నారు.

కన్నడిగులు ఆగ్రహానికి కారణం ఏమిటంటే…కర్ణాటకలో కన్నడ వెర్షన్​ కన్నా తెలుగు వెర్షన్​ను ఎక్కువ షోలు ప్రదర్శించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. “తెలుగు వెర్షన్​ 200 కన్నా ఎక్కువ షోలు.. హిందీ(10ప్లస్​), మలయాళం, తమిళం(4ప్లస్​) కన్నడలో కేవలం మూడు షోలు మాత్రమేనా?” అంటూ ఓ నెటిజన్​ ట్వీట్​ చేశారు.

Pushpa Movie Trailer Cut Pics | Pushpa Trailer: సోషల్ మీడియాలో 'పుష్ప'రాజ్ ట్రెండింగ్.. ఆకట్టుకుంటున్న ట్రైలర్ కట్ పిక్స్ | వినోదం News in Telugu

దీంతో తమ రాష్ట్రంలో తమ భాషకు ప్రాధాన్యతను ఇవ్వకుండా ఇతర భాషల్లో ఎలా రిలీజ్ చేస్తారు ? అంటూ మేకర్స్ ను ప్రశ్నిస్తున్నారు కన్నడిగులు. కన్నడ కాకుండా తెలుగు వెర్షన్ రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాలలో విడుదల కావడం ప్రాంతీయవాదులకు ఏమాత్రం నచ్చలేదు.

దీంతో కర్ణాటకలోని అల్లు అర్జున్ అభిమానులు… ఈ చిత్రాన్ని బహిష్కరించమంటున్నాం అంటే తెలుగుకు, లేదా సినిమాకు తాము వ్యతిరేకం కాదని, కానీ తమ రాష్ట్రంలో తమ భాషకే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు గంటల పుష్ప కోసం మా కన్నడ భాషను అవమానించలేము” అంటూ విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు.

Related posts