కోలీవుడ్ కమెడియన్ సంతానం తొలుత హాస్యనటుడిగా తమిళ ప్రేక్షకులను అలరించిన సంతానం ప్రస్తుతం హీరోగా మారారు. ఆయన హీరోగా నటించిన పలు చిత్రాలు హిట్ అయ్యాయి. తాజాగా కొత్త గెటప్‌తో ఉన్న సంతానం పిక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ పిక్ కు అతితక్కువ వ్యవధిలోనే భారీగా లైకులు వచ్చాయి. ఈ పిక్ లో సంతానం చూసి ఎవరూ అంత త్వరగా గుర్తించలేరు. సంతానం నిండైన గడ్డంతో నల్లటి కళ్ళద్దాలతో కొత్త గెటప్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కొత్తగా నటించబోయే చిత్రం కోసం సంతానం ఈ వెరైటీ గెటప్‌కు మారినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ‘బిస్కోత్’, ‘డిక్కిలోనా’ చిత్రాలలో సంతానం హీరోగా నటించారు. వీటిలో ‘బిస్కోత్’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక హీరోగా మారిన తర్వాత సంతానం ప్రముఖ హీరో ఆర్యాతో కలిసి చెన్నై ఈస్ట్‌కోస్ట్ రోడ్డులో తరచూ వాకింగ్‌కు వెళుతూ, వ్యాయామం చేస్తూ దేహదారుఢ్యాన్ని పెంచుకుంటున్నారు.
next post