మోడల్ గెహనా వశీష్ట (31) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు గుండె పోటు రావటంతో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. సరైన నూట్రిషనల్ డైట్ తీసుకోకుండా సుధీర్ఘంగా సెట్స్‌లో పనిచేయటం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్టుగా డాక్టర్లు చెపుతున్నారు. గురువారం మధ్యాహ్న సమయంలో ఓ వెబ్ సిరీస్ కోసం మద్ ఐలాండ్‌లో షూటింగ్ చేస్తుండగా గెహనా స్పృహ తప్పి పడిపోయ్యింది. వెంటనే స్పందించిన యూనిట్ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరే సమయానికి ఆమె పల్స్ పూర్తిగా ఆగిపోయినట్టుగా డాక్టర్లు వెల్లడించారు. ఎలక్ట్రిక్ షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చి ప్రయత్నించగా రెండు గంటల తరువాత తిరిగి నాడి కొట్టుకోవటం ప్రారంభమైందని తెలిపారు. అంతేకాదు ఆమె శరీరం చికిత్సకు స్పందించటం లేదని, శ్వాస కూడా తీసుకోలేకపోతుందని తెలిపారు. ఆమెకు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నామన్న ఆసుపత్రి వర్గాలు ప్రస్తుతం పరిస్ధితి అత్యంత విషయంగా ఉందని వెల్లడించారు. పలు టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్‌లలో నటిస్తున్న గెహనా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో హల్ చల్ చేస్తుంటారు. నటిగా కన్నా మోడల్‌గానే ఈమెకు ఎక్కువ పేరుంది. గతంలో న్యూడ్ ఫోటోలతో హల్‌చల్ చేసిన ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటో షూట్‌లను రిలీజ్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. తెలుగులోను పలు చిత్రాల్లో నటించింది గెహనా. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించటంతో పాటు ఐటమ్ సాంగ్స్‌లోనూ అలరించింది.
Television actress and model #GehanaVasisth has suffered a cardiac arrest and has been admitted to hospital after being on a long working shift without taking proper nutrition, doctor said.
Photo: IANS pic.twitter.com/MRyl6IWzh0
— IANS Tweets (@ians_india) 22 November 2019