మాచో హీరో గోపిచంద్ అక్టోబర్ 5న “చాణక్య” అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న గోపిచంద్ తాజాగా తన 28వ ప్రాజెక్ట్ ప్రారంభించాడు. మరి కొద్ది రోజులలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కించనున్నారు. తమన్నా కథానాయికగా నటించనుంది. ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మిస్తున్నారు. చిత్ర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. బోయపాటి శీను క్లాప్ కొట్టారు. ప్రారంభ కార్యక్రమానికి చిత్రబృందంతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సంపత్ నంది – గోపిచంద్ కాంబినేషన్‌లో “గౌతమ్ నందా” అనే చిత్రం తెరకెక్కగా ఈ చిత్రం 2017లో విడుదలై మిక్స్‌డ్ టాక్ పొందింది. కాగా గోపిచంద్ బిను సుబ్రమణ్యం అనే కొత్త దర్శకుడి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది.
Excited to share with you all about my next movie with @IamSampathNandi under @SS_Screens Production launched today.@tamannaahspeaks #Gopichand28 pic.twitter.com/Z0UGSYFzJL
— Gopichand (@YoursGopichand) October 3, 2019