telugu navyamedia
సినిమా వార్తలు

గుండెపోటుతో కన్నుమూసిన ప్ర‌ముఖ హాస్య‌న‌టుడు క్రేజీ మోహ‌న్

Crazy-Mohan

కోలీవుడ్‌ ప్ర‌ముఖ సీనియ‌ర్ క‌మెడియ‌న్ క్రేజీ మోహ‌న్ గుండెపోటుతో చెన్నైలో ఈరోజు మరణించారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఉన్న‌ట్లుండి గుండెపోటు రావ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ని ద‌గ్గ‌ర‌లోని కావేరి హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. డాక్ట‌ర్లు ఆయ‌న్ని కాపాడ‌టానికి చేసిన ప్ర‌య‌త్నాలన్ని విఫ‌ల‌మ‌య్యాయి. క్రేజీ మోహ‌న్ మృతికి సినీ ప‌రిశ్ర‌మ సంతాపాన్ని తెలియ‌జేసింది. “క్రేజీ తీవ్స్ ఇన్ పాల‌వాక్కం” అనే నాట‌కం త‌ర్వాత ఈయ‌న‌కు క్రేజీ మోహ‌న్ అనే పేరు వ‌చ్చింది.

1952లో ఈయ‌న జ‌న్మించిన ఈయ‌న 1973లో మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్‌ను పూర్తి చేశారు. ఇంజ‌నీరింగ్ చదివేరోజుల్లోనే నాట‌కాల‌కు స్క్రిప్ట్స్ రాసేవారు. క్రేజీ మోహ‌న్ సోద‌రుడు మ‌ధు బాలాజీ నాట‌క కంపెనీకి స్క్రిప్ట్ రైట‌ర్‌గా ప‌నిచేశారు. కె.బాల‌చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `పొయ్‌క‌ల్ కుద‌రై` సినిమాతో న‌టుడిగా సినీ రంగ ప్ర‌వేశం చేశారు. వెన్‌బా అనే సింగిల్ లైన్ ఏక‌వాక్య క‌విత‌లు రాసేవారీయ‌న‌. ఇప్ప‌టి వ‌ర‌కు 40 వేల వెన్‌బాల‌ను ఆయ‌న ర‌చించారు. ఇయ‌న మంచి చిత్ర‌కారుడు కూడా. అపూర్వ స‌హోద‌రులు, మైకేల్ మ‌ద‌న కామ‌రాజు, స‌తీలీలావ‌తి, తెనాలి, పంచ‌తంత్రం, కాద‌ల కాద‌ల‌, భామ‌నే స‌త్య‌భామ‌నే, వ‌సూల్ రాజా ఎం.బి.బి.ఎస్ త‌దిత‌ర చిత్రాల్లో కామెడీ పాత్ర‌ల‌తో న‌టించి త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు.

Related posts