telugu navyamedia
సినిమా వార్తలు

మజిలీ వీడియో సాంగ్ : “నా గుండెల్లో…” వీడియో సాంగ్

3rd single from majili movie

శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగచైతన్య జంటగా నటించిన “మజిలీ” చిత్రం ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే 50 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం థియేటర్లలో ఇప్పటికి తన దూకుడును కొనసాగిస్తోంది. సాధారణంగా ఏ భాషలోనైనా ఓ సినిమా హిట్ అయితే ఆ సినిమాను ఇతర భాషల్లో కూడా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. ఈ చిత్రాన్ని కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. త్వ‌ర‌లోనే త‌న సొంత బ్యానర్ వండ‌ర్ బార్ ఫిలింస్ సంస్థ‌పై ధ‌నుష్ ఈ చిత్రాన్ని రీమేక్ చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి “నా గుండెల్లో…” అనే వీడియో సాంగ్ ను విడుదల చేశారు చిత్రబృందం. యాజిన్ నిజార్, నిఖిత గాంధీ ఈ పాటను ఆలపించారు. రాంబాబు గోసాల ఈ పాటకు లిరిక్స్ అందించారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు. ఈ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.

Related posts