telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హల్దీ వేడుకలో కాజల్… పిక్స్ వైరల్

Kajal

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఈ బ్యూటీ కొద్దిరోజుల క్రితం తన పెళ్లి గురించి అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ ప్రేమ పెళ్లికి రెండు కుటుంబాలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని, కుటుంబసభ్యుల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగినట్లు కాజల్ ప్రకటించింది. కరోనా కారణంగా కేవలం కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలోనే వివాహం చేసుకుంటున్నట్లు కాజల్ వెల్లడించింది. తన స్నేహితుడు, ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును ఈ నెల 30వ తేదీన వివాహం చేసుకోనుంది. వారి వివాహనికి ఇంకా ఒక రోజు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో నిన్న(బుధవారం) మెహందీ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాజల్‌ గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈరోజు కాజల్ ఇంట హల్దీ వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts