telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

అసలు దీపావళి ఎందుకు జరుపుకుంటారో…తెలుసా

ఇవాళే దీపావళి పండగ. ఈ రోజున అందరు, బాధలను మరిచిపోయి ఎంతో సంతోషంగా గడుపుతారు. అసలు దీపావళి పండగ అంటే ఏంటో చూద్దాం. దీపం జ్యోతి స్వరూపం. అదే పరబ్రహ్మం, చీకటిని పారద్రోలి చెడుపై మంచి విజయానికి ప్రతీక. ఆ జ్యోతి మనలోని అజ్ఞానాన్ని రూపుమాపుతుంది. దీపావళి పండుగ పరామర్థమిదే ! అమావాస్య నాడు పున్నమిని తలపించే రేయి.. దీపావళి. వర్గ, వయో భేదాలు లేకుండా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ. అది నవ్యకాంతుల నేత్రావళి. దివ్య జ్యోతుల దీపావళి.

దీపావళి రోజే శ్రీరామచంద్రుడు రావణాసురుడిని సంహరించాడు. నరకాసురుడిని సత్యభామాదేవి హతమార్చింది కూడా దీపావళి రోజే. చెడుపై మంచి సాధించిన విజయాన్ని సర్వజనులు సంబరంగా జరుపుకుంటారు. దీపకాంతులతో ఉరుము లేని పిడుగులా ఈ ఏడాది ప్రపంచాన్ని పెను ఉప్పెనలా కమ్మేసిన కరోనా రక్కసిని పారద్రోలి సకల శుభాలను వొసగమని అమ్మవారిని వేడుకుంటారు. లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షంతో మీ జీవితంలో దివ్యకాంతులు విరజిమ్మాలని, ఇంటింటా సిరులు, సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటారు. ఏది ఏమైనా అందరికి దీపావళి శుభాకాంక్షలు.

Related posts