telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్నిరకాల వాహన ధ్రువీకరణ పత్రాల చెల్లుబాటును జూన్ 30వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా-రహదారుల మంత్రిత్వశాఖ రాష్ట్రాలకు సమాచారం అందించింది. ఫిట్ నెస్ సర్టిఫికెట్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ తో పాటు ఇతర ధ్రువీకరణ పత్రాలకు ఇది వర్తిస్తుంది. లాక్ డౌన్ లో పత్రాలను రెన్యువల్ చేయించుకోని కారణంగా వెసులుబాటు కల్పించింది. అయితే.. ఈసారి మాత్రం ఫిబ్రవరి 1, 2021 నుంచి మార్చి 31 మధ్య వ్యాలిడిటీ పూర్తయిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. వీరందరికీ మరో మూడు నెలలపాటు వ్యాలిడిటీ పొడగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే జూన్‌ 30 వరకు వారి ద్రువ పత్రాలు చెల్లుబాటు అవుతాయని తెలిపింది.

Related posts