భారత క్రీడా మంత్రి కిరెణ్ రిజిజు ఫిట్ ఇండియా మార్చ్‌ను మొదలు చేయనున్నారు. ఇది అక్టోబరు 31న ప్రారంభమయ్యి వరుసగా 3 రోజులపాటు కొనసాగనుందని తెలిపారు. అంతేకాకుండా ఇందులో బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ కూడా పాలుపంచుకోనున్నాడు. అయితే ఈ ఫిట్ ఇండియా వాక్‌తాన్ నవంబర్ రెండుతో 200 కిలోమీటర్లను చేరుకొని ముగించనుంది. ఇందులో విద్యుత్‌జమ్వాల్‌తో పాటు జవాన్లు, పోలీసులు మరికొన్ని డిపార్టిమెంట్ల అధికారులు చేరనున్నారు. అయితే ఈ ప్రయాణం రాత్రిపగలు తేడా లేకుండా కొనసాగనుందని తెలిపారు.
ఇది థార్ ఎడారి మార్గంగా జరగనుందని సమాచారం. ‘ఇది ఫిట్ ఇండియాను తయారు చేయమని పీఎంకు మేము ఇచ్చే పిలుపు. అయితే దేశ జవాన్లు, రక్షణ శాఖ అధికారులు వచ్చినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. నేను జైసల్మీర్ నుంచి వారితో కలవనున్నాను. ఇందులో పాల్గొనడం ఎంతో సంతోషాన్నిస్తుంది. స్పోర్ట్స్ మినిస్టర్‌గా ఫిట్‌నెస్ ఎంత ముఖ్యమో దేశానికి తెలియజేయాల్సిన బాధ్యత నాకుంద’ని రిజిజు ప్రకటించారు. ఇండియాలో ఫిట్‌నెస్ ప్రాముఖ్యతను తెలపడమే దీని ముఖ్య ఉద్దేశ్యమనీ, ఇదే విధంగా నిర్వహించిన ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్‌లో 6.5 కోట్లమంది పాల్గొన్నారని ఆయన తెలిపారు. దేశంలో ఫిట్‌నెస్ ప్రధాన్యం ఎంతో చక్కగా అర్థమవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందని విద్యుత్ జమ్వాల్ తెలిపారు.