telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ నిర్మల విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మహేష్

Mahesh

గతేడాది జూన్ నెలలో విజయ నిర్మల అనారోగ్యంతో కన్నుమూసారు.నానక్‌రామ్‌గూడలోని విజయనిర్మాల నివాసంలో విజయ నిర్మల విగ్రహాన్ని ఏర్పాటుచేయనున్నారు. ఈ విగ్రహాన్ని సూపర్‌స్టార్ మహేష్ బాబు ఆవిష్కరించనున్నారట. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఎంపీ సంతోష్, ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల.. దర్శకురాలుగా 44 చిత్రాలను రూపొందించి.. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విజయనిర్మల ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు. మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు.సూపర్ స్టార్ కృష్ణ- విజయనిర్మల కాంబినేషన్‌‌లో వచ్చిన పలు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి. ‘సాక్షి’ చిత్రంతో మొదలైన వీరి సినీ ప్రయాణం వివాహ బంధానికి కారణమైంది.వీరిద్దరూ సుమారు 47 చిత్రాల్లో కలిసి నటించారు. 

Related posts