telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

300 మార్క్ క్రాస్ చేసిన భారత్…

భారత్-ఆసీస్ మధ్యలో నేడు మూడో టెస్ట్ లో ఆఖరి రోజు ఆట జరుగుతుంది. అయితే నిన్న ఆట ముగిసే సమయానికి 98 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయిన భారత్ ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది. అయితే ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ డ్రా చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈ రోజు మొదటి సెషన్లో దూకుడు ప్రదర్శించిన భారత జట్టు పంత్, పుజారా ఔట్ అయిన తర్వాత నెమ్మదించింది. అయితే ప్రస్తుతం భారత్ 300 పరుగులను క్రాస్ చేసింది. అయితే 299 పరుగుల తర్వాత మిగిలిన ఆ ఒక్క పరుగును తీయడానికి భారత ఆటగాళ్లు 5 ఓవర్లను తీసుకున్నారు అంటేనే అర్ధం చేసుకోవచ్చు భారత బ్యాటింగ్ ఎంత నెమ్మదిగా సాగుతుంది అనేది. అయితే ప్రస్తుతం అశ్విన్(24), విహారి(7) తో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. మరో వికెట్ పడకూడదు అనే ఉదేశ్యంతో వీరు చాలా నెమ్మదిగా ఆడుతూ మ్యాచ్ ను డ్రా వైపుగా నడిపిస్తున్నారు. అయితే భారత్ ఇప్పుడు విజయం సాధించాలంటే 16 ఓవర్లలో 106 పరుగులు చేయాలి. అదే ఆసీస్ గెలవాలంటే మరో 5 వికెట్లు తీయాల్సి ఉంటుంది. చూడాలి మరి ఎం జరుగుతుంది అనేది.

Related posts