telugu navyamedia
Uncategorized

ఏపీలో పాఠశాలలు, కాలేజీల ప్రారంభ కొత్త షెడ్యూల్…

school students

ఆంధ్ర ప్రదేశ్ లో నవంబర్‌ 2 నుంచి తిరిగి పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోనున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు. ఈ మేరకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్‌ వ్యాపించకుండా అన్నరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను వివరించారు.  నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి. .  నవంబర్‌ 2 నుంచి 9,10, ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం , ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం తరగతులు రోజు విడిచి రోజు నడపనున్నారు. హాఫ్ ‌డే మాత్రం నిర్వహిస్తారని పేర్కొన్నారు. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి అన్ని కాలేజీలకూ కూడా నవంబర్‌ 2నుంచే తరగతులు ప్రారంభిస్తారు. రొటేషన్‌ పద్ధతిలో ఈ తరగతులను నిర్వహిస్తారని అన్నారు. నవంబర్‌ 23 నుంచి 6,7,8  క్లాసులకు బోధన ప్రారంభం అవుతుంది. రోజు విడిచి రోజు, హాఫ్‌ డే పాటు క్లాసులు నిర్వహిస్తారుని సమాచారం. డిసెంబర్‌ 14 నుంచి 1,2,3,4,5 తరగతులను ప్రారంభిస్తారు. రోజువిడిచి రోజు, హాఫ్‌ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు.

Related posts