telugu navyamedia
సినిమా వార్తలు

స్టార్ కొరియోగ్రాఫర్ కు జైలు శిక్ష

Johnny Master Arrested
టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరితో పని చేసిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మేడ్చల్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఈ వార్త టాలీవుడ్ కు షాకిచ్చింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లాంటి మెగా హీరోలతోనే కాకుండా ఇతర టాలీవుడ్ స్టార్ హీరోలతో కూడా అదిరిపోయే స్టెప్పులు వేయించి, ప్రేక్షకులతో విజిల్స్ వేయించాడు జానీ మాస్టర్.  
అయితే 2015లో చెక్ బౌన్స్ విషయంలో జానీ మాస్టర్ పై నమోదైన కేసు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. జానీ మాస్టర్ పై మొదటి సెక్షన్ 354. 324, 506 కింద కేసులు నమోదు కాగా… సెక్షన్ 354 కేసును కొట్టివేసిన కోర్టు మిగతా కేసులు నిజమని నిరూపితమవ్వడంతో జానీ మాస్టర్ కు 6 నెలల జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో మరో అయిదుగురు నిందితులకు కూడా శిక్ష పడినట్లు తెలుస్తోంది. ఇక జానీ మాస్టర్ పై చెక్ బౌన్స్ తో పాటు మరికొన్ని కేసులు కూడా ఉన్నట్లు సమాచారం. 

Related posts