telugu navyamedia
సినిమా వార్తలు

కృష్ణాష్టమి సందర్భంగా ‘రాధేశ్యామ్‌’ స్పెషల్‌ పోస్టర్‌

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’‌. కె. రాధాకృష్ణకుమార్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్‌ చేశాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా ఓ సర్‌ప్రైజింగ్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో ప్రభాస్‌, పూజాల లుక్‌ ఆకట్టుకుంటుంది. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల మీద వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు.

యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్నరాధేశ్యామ్‌ సినిమాలో ప్రభాస్‌ విక్రమాదిత్యగా, పూజా హెగ్డే డాక్టర్‌ ప్రేరణగా నటించారు. కృష్ణంరాజు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ భారీ బడ్జెట్‌ సినిమా 2022 జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Related posts