telugu navyamedia
రాజకీయ వార్తలు సినిమా వార్తలు

విమర్శలు చేస్తే.. రోజాకి కూడా ప్రతివిమర్శలు తప్పవు .. : నాగబాబు

nagababu from kakinada as mp candidate

పవన్ కళ్యాణ్ జగన్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుండడంతో నగరి ఎమ్మెల్యే రోజా పవన్ కళ్యాణ్ కు గట్టిగానే కౌంటర్ ఇస్తూ వస్తోంది. అయితే నాగబాబు ఇప్పుడు కూడా రోజా పై ఎలాంటి విమర్శలు చేయలేదు. ఆ మధ్య ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ రోజాతో తనకున్న రిలేషన్ షిప్ గురించి చెప్పాడు. పవన్ కళ్యాణ్ ను విమర్శించిన రోజా మీ పక్కనే కూర్చుని జబర్దస్త్ జడ్జి గా చేస్తున్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి అని నాగబాబుకు ఎదురైన ప్రశ్నకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాగబాబు. ఈ ప్రశ్నకు కూల్ గా సమాధానం చెప్పేశాడు నాగబాబు. జబర్దస్త్ లో ఉన్నప్పుడు కేవలం ప్రొఫెషనల్గా మాత్రమే ఆలోచిస్తామని… అక్కడ తమను విమర్శించుకోడానికి పిలవలేదని…జడ్జ్ మెంట్ చెప్పాలని పిలిచారని అంతవరకే తమ కు సంబంధం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఎవరిని ఎవరు కామెంట్ చేస్తారు అన్నది పట్టించుకోనంటున్నారు మెగా బ్రదర్.

రోజా వైసీపీ తరఫున మాట్లాడుతుందని పర్సనల్గా ఇలాంటివి ఉండవు కాబట్టి ఆమెతో వచ్చే సమస్య ఏమీ లేదు అంటున్నాడు మెగా బ్రదర్ నాగబాబు. ఒకవేళ పర్సనల్ జరిగినప్పుడు తాను కూడా ఖచ్చితంగా కౌంటరిస్తా అని చెప్పుకొచ్చాడు. జబర్దస్త్ లో జడ్జి లుగా ఉన్నప్పుడు మాత్రం ఇద్దరం ప్రొఫెషనల్ గా నే ఆలోచిస్తామని చెబుతున్నారు మెగా బ్రదర్ నాగబాబు. ప్రస్తుతం అయితే జగన్ ని ఎవరైనా పల్లెత్తు మాట అన్న తీవ్ర విమర్శలు చేసే రోజా, పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న సైలెంట్ గానే ఉండటం గమనార్హం.

Related posts