telugu navyamedia
రాజకీయ వార్తలు

జై శ్రీరాం బదులు జై హింద్‌: మమత

BJP compliant EC West Bengal

జై శ్రీరాం అంటే.. దీదీ జైలులో పెడుతుందని ప్రధాని మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. తాను బీజేపీ నినాదంతో ఏకీభవించనని తేల్చిచెప్పారు. జై శ్రీరాం బదులు జై హింద్‌ అని నినదిస్తానని వెల్లడించారు. శ్రీరాముడి పేరుతో రాజకీయాలు చేయటం ప్రారంభించిన బీజేపీ గత ఐదేళ్లలో ఒక్క చిన్న రామ మందిరాన్ని కూడా నిర్మించలేదని ఆమె ధ్వజమెత్తారు. తన ప్రభుతాన్ని డబ్బు దండుకొనే సిండికేట్లు నడుపుతున్నాయంటూ విమర్శించిన మోదీపై మమతా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుత ఎన్నికల్లో మోదీకి ప్రజాస్వామ్య చెంపదెబ్బ గట్టిగా తగులుతుందని దీదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీని అసత్యాలు పలికే వ్యక్తిగా దీదీ వర్ణించారు. ఈ ఎన్నికల్లో మోదీకి ఓటమి తప్పదని ఆమె హెచ్చరించారు.

మరో వియపు మమతా బెనర్జీ మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై.. బీజేపీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ స్పందించారు. దీదీ అన్ని హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో దీదీని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు. ‘మమతా బెనర్జీ మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. కానీ మోదీ ఈ దేశానికి ప్రధాని. మెరుగైన పాలన అందించడం కోసం భవిష్యత్తులో మీరు, మేము కలిసి పని చేయాల్సి వస్తుంది. కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదం’టూ సుష్మా స్వరాజ్‌ ట్వీట్‌ చేశారు.

Related posts