telugu navyamedia
సినిమా వార్తలు

రతన్‌టాటాను రాష్ట్రపతి చేయాలి: నాగబాబు

మెగా బ్రదర్‌ నాగబాబు సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. తాజాగా నాగబాబు రాష్ట్రపతి అంశంపై స్పందించారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుందని.. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని ప్రేమించే వ్యక్తి రాష్ట్రపతి కావాలన్నారు. కాగా రాష్ట్రపతిగా రతన్‌టాటా పేరును సూచించి.. అందరిని ఆశ్చర్యపరిచారు నాగబాబు. ‘‘ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులును ఎదుర్కొంటుంది. రోజు రోజుకు పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఇలాంటి సమయంలో తదుపరి రాష్ట్రపతి రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు పన్నే వ్యక్తి కాకుండా.. దేశాన్ని తన కుటుంబంలా భావించి ప్రేమించే వ్యక్తి అయితే బాగుంటుంది. భారత దేశ తదుపరి రాష్ట్రపతిగా నేను ప్రతిపాదించే వ్యక్తి ఎవరంటే రతన్‌టాటా గారు’’ అంటూ నాగబాబు ట్వీట్‌చేశారు. దాంతో పాటు #RatanTataforPresident అనే హ్యాష్‌ట్యాగ్‌ని షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది.

ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం దాదాపుగా మరో ఏడాది వరకు ఉంది. దీని పైన జాతీయ స్థాయిలో కూడా గత కొన్ని రోజులుగా అప్పుడప్పుడు చర్చలు జరుగుతున్నాయి. నిర్దిష్టంగా ఎవరు పోటీలో ఉంటారనే అంశం పైన మాత్రం క్లారిటీ లేదు. ఇక ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ తదుపరి రాష్ట్రపతి రేసులో ఉన్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. కానీ దాని గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అలాంటిది ఇప్పుడు ఇంత సడెన్‌గా రాష్ట్రపతి ఎన్నిక అంశం పైన నాగబాబు ఎందుకు స్పందించారనేది చర్చనీయాంశంగా మారింది.

Related posts