telugu navyamedia
సినిమా వార్తలు

కాజల్ సినిమాపై సూపర్ స్టార్ అభిమానులు ఫైర్

Comali

ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో ప్రముఖ తమిళ హీరో జయం రవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం “కోమలి”. ఈ చిత్రంలో జయం రవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఈ నెల 15వ తేదీన విడుదల కానుంది. 16 సంవత్సరాల పాటు కోమాలో వుండి బయటికి వచ్చిన వ్యక్తిగా ఈ సినిమాలో జయం రవి కనిపిస్తాడు. ఇటీవల ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను విడుదల చేశారు. కోమాలో నుంచి బయటికి వచ్చిన జయం రవి ఎదురుగా వున్న టీవీ చూస్తాడు. ‘నేను రాజకీయాల్లోకి వస్తాను’ అని రజనీ చెబుతుండటం చూసి, ఇది ఏ సంవత్సరం అని యోగిబాబును అడిగితే 2016 అంటాడు. అబద్ధాలు చెప్పి నన్ను ఫూల్ చేయాలనుకుంటున్నావా… ఇది 1996 అని జయం రవి అంటాడు. అంటే తను రాజకీయాల్లోకి వస్తానని రజనీ అప్పటి నుంచి చెబుతూనే వున్నాడనే అర్థం వచ్చేలా చూపించారు. దాంతో రజనీ అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఫైర్ అవుతున్నారు. అభిమానుల ఆగ్రహం తట్టుకోలేక తమకి ఆ ఉద్దేశం లేదంటూ వివరణ ఇచ్చిన దర్శక నిర్మాతలు మొత్తానికి రజనీకి సంబంధించిన సీన్ ను కట్ చేయాలనే నిర్ణయానికి వచ్చారట.

Related posts