telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సైరా”కు కోసం నాలుగు భాషల్లో… నలుగురు సూపర్ స్టార్లు

Syeraa

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్‌ను చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22) సందర్భంగా రెండు రోజుల ముందుగానే ఆగస్ట్ 20న విడుదల చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా “సైరా” టీజర్ ట్రెండ్ అవుతుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేది. “సైరా” చిత్రం తెలుగుతో పాటు హిందీ , తమిళ, మలయాళ, కన్నడ భాష‌ల‌లో విడుద‌ల కానుండ‌గా, చిత్ర యూనిట్ ఆయా భాష‌ల‌కి సంబంధించిన సూప‌ర్ స్టార్స్‌తో బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ చెప్పించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. హిందీలో ఈ చిత్రాన్ని ఫర్హాన్‌ అక్తర్‌, రితేష్‌ సిద్వాని, అనిల్‌ టడానీ రిలీజ్ చేస్తున్నారు. త‌మిళంలో ర‌జ‌నీకాంత్‌, మ‌ల‌యాళంలో మోహ‌న్ లాల్‌, హిందీలో హృతిక్ రోష‌న్, క‌న్న‌డ‌లో య‌ష్‌ వంటి స్టార్ హీరోలతో “సైరా” చిత్రానికి నేపధ్య వాయిస్‌ చెప్పించాలని చిత్రబృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది.

Related posts