ఎంతమంది యాంకర్స్ వచ్చినా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ సుమ కనకాల. మలయాళీ అమ్మాయి అయినా కూడా తెలుగులో ఆమె మాట్లాడే విధానం, సమయస్ఫూర్తికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. యాంకర్ సుమ, రాజీవ్ కనకాల విడిపోయారు అనే వార్త పలు వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈమె విడాకులు తీసుకోబోతుంది అంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి వీరిద్దరూ గతకొద్ది కాలంగా వేరువేరుగా ఉంటున్నారని కూడా తెలుస్తోంది. కారణం ఏంటని అడిగితే మాత్రం పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. సుమ సంపాదన విషయంలో రాజీవ్ కనకాలకు పడటం లేదని ఆయన ఓర్చుకోలేకపోతున్నారని కొన్ని పుకార్లు అయితే వస్తున్నాయి. అయితే సుమ సంపాదనతో నాకు సంబంధం లేదు. తనను ఏ రోజూ ఆ విషయం అడగలేదు అని రాజీవ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
అయితే సుమ ఎప్పటినుండో విడిపోవాలని ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. కొన్నాళ్లక్రితమే ఆస్తి మొత్తం తన పేరిట రాయించుకున్న సుమ పిల్లల్ని కూడా తండ్రితో మాట్లాడనివ్వడం లేదని అంటున్నారు. కొద్దిరోజులుగా రాజీవ్ ఒంటరిగా, సుమ పిల్లలతో కలిసి ఉంటున్నారట. కాగా ప్రస్తుతం రాజీవ్ మణికొండలో ఉంటున్న ఇళ్లు కూడా సుమ కొన్నదేనని తెలుస్తోంది. ఇదిలా ఉంటే రెండేళ్ల కాలంలో రాజీవ్ కుటుంబంలో ఊహించని సంఘటనలు జరిగాయి. తల్లి లక్ష్మీ, తండ్రి దేవదాస్ కనకాల, ఇటీవల సోదరి శ్రీలక్ష్మీ మరణించడంతో రాజీవ్ మానసికంగా కృంగిపోయాడు. ఆ సమయంలో కేవలం కోడలిగా బాధ్యత నెరవేర్చిందే తప్ప రాజీవ్‌కి భార్యగా మాత్రం సుమ ప్రవర్తించ లేదనే మాట బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం రాజీవ్ కుటుంబంలో నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా భార్య భర్తలు విడిపోయారనే వార్త బయటకి రావడం విచారం.
అది మీ కళ్ళకు తెలియలేదా ? : అమలాపాల్