telugu navyamedia
రాజకీయ వార్తలు

అమేరికాలోకి వలసలు నిలిపివేత.. ట్రంప్ కీలక నిర్ణయం!

trump usa

కరోనా వైరస్‌ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా అల్లాడుతోంది. ఆ దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 42,514 మంది మృతి చెందారు. అమెరికాలో నిన్న ఒక్కరోజే 1939 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. దేశంలోకి వలసలను నిరోధించేందుకు ఇమ్మిగ్రేషన్‌ను నిలిపివేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ నేడు సంతకం చేయబోతున్నారు.

అదృశ్య శత్రువు దాడి నుంచి తప్పించుకునేందుకు, అదే విధంగా అమెరికా పౌరుల ఉద్యోగాలను కాపాడుకునేందుకు అమెరికాలోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేస్తున్నట్లు ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. అమెరికాకు వలస వెళ్లే వారిలో భారత్, చైనా దేశస్థులే అధికంగా ఉంటారు. ఇప్పుడీ నిర్ణయం అమల్లోకి వస్తే ఇకపై అమెరికాలో అడుగుపెట్టడం కష్టతరంగా మారనుంది.

Related posts