తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. రాష్ట్రంలో పాడి రైతుల బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సచివాలయం ముట్టడిస్తామనిహెచ్చరించారు. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును ఈరోజు కోమటిరెడ్డి కలిశారు. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, బునాదిగాని కాల్వ పనుల బిల్లులు చెల్లించాలని కోరారు.
మరమ్మతు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ లకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. భూసేకరణకు రూ.50 కోట్లు, గుత్తేదారులకు రూ.45 కోట్లు, పాడి రైతుల ప్రోత్సాహకానికి సంబంధించి రూ.100 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు. మదర్ డెయిరీ రైతులకే రూ.25 కోట్లు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు నివాసం చుట్టూ మంత్రుల చక్కర్లు: అచ్చెన్నాయుడు