telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

‘‘బాత్ బీహార్ కీ’’ పేరుతో నితీశ్ కుమార్‌పై ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు

prashanth-kishor

బీహార్ ముఖ్యమంత్రి, మాజీ రాజకీయ గురువు నితీశ్ కుమార్‌పై ప్రశాంత్ కిషోర్ తీవ్ర స్థాయిలో బహిరంగంగా ప్రశ్నలు గుప్పించారు.నితీశ్ కుమార్‌ పాలనకు వ్యతిరేకంగా,కొత్త నాయకత్వం కోసం 1కోటిమంది యువతే టార్గెట్ గా ‘‘బాత్ బీహార్ కీ’’ పేరుతో రాష్ట్రంలో సరికొత్త ప్రచారం ప్రారంభించనున్నట్టు తెలిపారు.ఈ నెల 20న తన ప్రచారం మొదలవుతుందని పీకే తెలిపారు. రాబోయే 100 రోజుల్లో బీహార్ అంతటా పర్యటించి నితీశ్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగతానని ఆయన ప్రకటించారు. నూతన బీహార్‌ను నిర్మించేందుకు ‘బాత్ బీహార్ కీ ’ కార్యక్రమంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నానని అని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధిలో అట్టడుగున ఉండే బీహార్ కాకుండా సరికొత్త బీహార్‌ను కోరుకునే వాళ్లందర్నీతాను ఆహ్వానిస్తున్నానని పీకే తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లబోవడం లేదని, బీహార్ కోసం పనిచేసేందుకు అంకితమవుతానని ఆయన తెలిపారు. అభివృద్ధిలో బీహార్ ప్రస్తుతమున్న 22వ స్థానం నుంచి 10వ స్థానానికి చేరేలా బీహార్ అభివృద్ధి చెందడం చూడాలనుకుంటున్నట్లు పీకే తెలిపారు.
బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు నితీశ్ కుమార్ పార్టీ సిద్ధాంతాల విషయంలో రాజీపడ్డారంటూ పీకే విరుచుకుపడ్డారు. బీహార్ అభివృద్ధి చెందిందంటూ ముఖ్యమంత్రి నితీశ్ పేర్కొనడంపైనా ధ్వజమెత్తారు. బీహార్ అభివృద్ధి కోసం నితీశ్ కుమార్ ఎంతో చేశారనీ.. అయినా రాష్ట్ర పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉందని ఆయన గుర్తుచేశారు. చదువుకున్న యువకులు జీవోనోపాధి కోసం రాష్ట్రం విడిచి వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. నితీశ్ ఇప్పుడు గాడ్సే సిద్ధాంతాలను నమ్మే వాళ్ల పంచన చేరారు. పార్టీ సిద్ధాంతంపై నాకు, నితీశ్‌కు మధ్య చాలా సార్లు చర్చలు జరిగాయి. గాంధీజీ సిద్ధాంతాలను పార్టీ ఎప్పుడూ విడిచిపెట్టదని నితీశ్ మాతో చెప్పారు. కానీ ఇప్పుడు గాంధీజీని చంపిన నాథూరాం గాడ్సేపై మెతకవైఖరి చూపించే పార్టీలతో ఆయన పొత్తుపెట్టుకున్నారు. గాంధీ, గాడ్సే ఎప్పటికీ కలవరని పీకే తెగేసి చెప్పారు.ఒక్క జార్ఖండ్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే బీహార్ వెనుకబడి ఉంది. లాలూ పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందంటూ మీరు అడుగుతున్నారు. గత 15 ఏళ్లుగా మీరు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. మహారాష్ట్ర, కర్నాటకలతో పోల్చితే మీరేం అభివృద్ధి సాధించగలిగారు?’అని సీఎం నితీశ్‌ను పీకే ప్రశ్నించారు.నితీశ్ కుమార్ నన్ను కొడుకులా చూసుకుంటారు. నేను కూడా ఆయనను ఎప్పుడూ తండ్రిలానే భావిస్తాను. ఇక పార్టీలోకి తీసుకోవాలా లేదా బహిష్కరించాలా అన్నది నితీశ్ కుమార్ ఇష్టం. సీఏఏ, ఎన్నార్సీలపై కేంద్ర ప్రభుత్వానికి నితీశ్ నేతృత్వంలోని జేడీయూ పార్టీ మద్దతు ఇవ్వడంపై ఇద్దరికీ నితీష్-పీకేల ఇటీవల పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.

Related posts