telugu navyamedia
క్రీడలు వార్తలు

మోర్గాన్ పై విమర్శల వెల్లువ…

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 38 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమికి కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అనాలోచిత నిర్ణయాలే కారణమని మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడ్డారు. ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ… ‘ఆర్‌సీబీని ఆదిలోనే దెబ్బతీసిన వరుణ్ చక్రవర్తితో బౌలింగ్ కొనసాగించకుండా మోర్గాన్ పెద్ద తప్పిదం చేశాడు. అతన్ని ఆ స్పెల్‌లో అలానే కొనసాగించి ఉంటే డేంజరస్ బ్యాట్స్‌మన్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ ఔటయ్యేవాడు. అలా చేయకుండా షకీబ్ అల్ హసన్‌ను తీసుకొచ్చి మ్యాక్సీ క్రీజులో నిలదొక్కుకునేలా చేశాడు. అంతేకాకుండా 19వ ఓవర్‌లో ఆశ్చర్యకరంగా హర్భజన్ సింగ్‌కు బంతినిచ్చాడు. ఆ ఓవర్‌లో భజ్జీ ధారళంగా పరుగలిచ్చుకున్నాడు. ఏబీ డివిలియర్స్, కైల్ జెమీసన్ ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అని మోర్గాన్ భజ్జీకి బంతి ఇచ్చి ఉంటాడు. కానీ అతని వ్యూహం బెడిసికొట్టింది. ఆ టైమ్‌లో షకీబ్‌తో బౌలింగ్ చేయించి ఉంటే వేరేలా ఉండేది. అలాగే భారీ లక్ష్యచేధనకు దిగినప్పుడు ఆండ్రూ రస్సెల్‌ను అప్‌ది ఆర్డర్ పంపించాల్సింది. రస్సెల్ ఓ 40 బంతులు ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేది. 9వ ఓవర్‌లో అతను బ్యాటింగ్‌కు దిగుంటే సులువుగా మ్యాచ్‌ను గెలిపించేవాడు” అని చోప్రా చెప్పుకొచ్చాడు.

Related posts